సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రత

సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రత

న్యూ ఢిల్లీ: భారత్‌లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మే నెలలో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చూపింది. ఉత్తర భారతదేశంలో వర్షాపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని గంగానది తీర ప్రాంతాల్లో హీట్‌వేవ్స్‌ సాధారణం కంటే ఎక్కువ రోజులు ఉంటాయని వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. హీట్‌వేవ్స్‌ సాధారణ రోజుల కంటి ఒకటి నుంచి నాలుగు రోజులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగానే వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.నైరుతి ద్వీపకల్ప భారతం మినహా వివిధ ప్రాంతాల్లో మే నెలలో మూడు రోజులు వడగాలులు వీస్తాయి. వాయువ, మధ్య, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాలు మినహా దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం సాధారణం కంటే వేడి గాలులు వీచే అవకాశం ఉన్నది. నైరుతి ద్వీపకల్ప భారతదేశం మినహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మే నెలలో ఒకటి నుంచి మూడు రోజులు వేడి గాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. వాయువ్య, మధ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహాపాత్ర తెలిపారు.ఉత్తర భారతదేశంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఇది దీర్ఘకాలిక సగటు 64.1 మి.మీ కంటే 109 శాతం ఎక్కువ. ఈ సంవత్సరం మే నెలలో తరచుగా, తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో.. ఉష్ణోగ్రతలు 2024 మే నెలలో నమోదైన స్థాయికి చేరుకోకపోవచ్చు. ఏప్రిల్‌లో దేశంలో 72 వేడిగాలులు నమోదయ్యాయి. రాజస్థాన్, గుజరాత్ (6 నుంచి 11 రోజులు).. తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ (4 నుంచి 6 రోజులు) సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు నమోదయ్యాయి.సాధారణంగా ఇక్కడ రెండు నుంచి మూడు రోజులు అలాంటి రోజులు ఉంటాయి. తూర్పు-మధ్య భారతదేశం, మహారాష్ట్ర, ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలోని పరిసర ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు రోజులు వేడిగాలులు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే రెండు నుంచి మూడు రోజులు తక్కువ. ఏప్రిల్‌లో వేడిగాలులు పెరిగాయి. అయితే పశ్చిమ భారతదేశంలో ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ఏడాది 1901 తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో వడగాలులు నమోదయ్యాయి. అదే సమయంలో దక్షిణ, మధ్య భారతదేశంలోనూ వర్షాపాతం నమోదైంది. 1901 తర్వాత ఏప్రిల్‌లో దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం 13 అత్యధిక వర్షపాతం నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos