అంతర్జాలంలో తెలుగు వెలుగులు..

అంతర్జాలంలో తెలుగు వెలుగులు..

దేశంలో భాషను అభిమానించే ప్రజలతో పోలిస్తే తమిళనాడు ప్రజలు అగ్రస్థానంలో ఉంటారు.ప్రపంచంలో తమ భాష తప్ప మరో గొప్ప భాష లేదనే భావనతో ఉంటూ భాషాభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు.భాషాభిమానంలో తెలుగు ప్రజల మిగిలిన అన్ని రాష్ట్రాల ప్రజల కంటే చాలా వెనుకబడి ఉన్నారు.అయితే తాజాగా వెలుగు చూసిన ఓ అంశం భాషాభిమానంలో తెలుగు ప్రజల్లో కొద్దిగా చైతన్యం కలిగిందని తెలియజేసింది.అంతర్జాలం వినియోగించే తెలుగు ప్రజలు సమాచారాన్ని తెలుగులోనే తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలిసింది.గూగుల్‌,వికీపీడియా సమాచారాన్ని తెలుగులోనే పొందడానికి ఆసక్తి కనబరుస్తుండగా టైపింగ్‌ కూడా తెలుగులోనే చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారనే విషయం తేలింది.అంతర్జాలం వినియోగిస్తున్న తెలుగువారిలో 92 శాతం మందిది ఇదే ఆకాంక్ష అని గూగుల్ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది.దీంతో ఇంటర్నెట్దిగ్గజ సంస్థలు తెలుగుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. విషయంలో గూగుల్ఇప్పటికే ముందుండగా.. వికీపీడియా, ఇతర సంస్థలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి.తెలుగువారికి దగ్గరవ్వాలంటే తెలుగుకు దగ్గరవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. పరిణామాలు అంతర్జాలంలో తెలుగుకు మరింత వెలుగు ఇస్తున్నాయి.2016 చివరి నాటికి నాలుగు కోట్ల మంది తెలుగువారు ఇంటర్నెట్వినియోగిస్తున్నట్టు గూగుల్నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.2019 నాటికి సంఖ్య ఏడు కోట్లకు చేరింది. మాతృభాషల వినియోగంపై తాజాగా గూగుల్మరో సర్వే చేయగా సగటున ప్రతి 10 మంది భారతీయ వినియోగదారుల్లో 9 మంది గూగుల్లో తమ తమ భాషల్లోని సమాచారం కోసమే వెతుకుతున్నారని వెల్లడైందని తేల్చింది.భారతీయ భాషలు వాడేవారిలో 88 శాతం మంది తమ భాషల పట్ల ఆసక్తి చూపిస్తుండగా.. తెలుగులో సంఖ్య మరింత అధికంగా ఉందని అధ్యయనంలో తేలింది.ఇతర భాషల్లో ఇది 88శాతం ఉండగా, తెలుగులో 92 శాతం మంది ఉండటం గమనార్హం.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos