టెలికం సంస్థలకు మందలింపు

న్యూ ఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయం(ఏజీర్) ఛార్జీల చెల్లింపు వ్యవహారాల్లో పునఃసమీక్ష ఉండదని అత్యున్నత న్యాయస్ధానం బుధవారం మరో సారి టెలికాం సంస్థలకు బుధవారం తేల్చి చెప్పింది. దీనిపై స్వీయ మదింపు చేసుకున్న సంస్థల్ని మందలించింది.‘అసలు ఎవరు సమీక్షించమన్నారు’అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బకాయిలు వసూలులో ప్రభుత్వ తీరునూ కోర్టు తప్పుబట్టింది. ఛార్జీల పునః సమీక్షకు గడువు ఇవ్వాలన్న కేంద్రం వాదనను తోసి పుచ్చింది. ‘కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యం కాద’ని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసం వ్యాఖ్యానించింది. ఒకవేళ పునఃసమీక్షని అంగీకరిస్తే కోర్టు గతంలో తప్పు చేసినట్ల వుతుందని. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదు. బకాయిల చెల్లింపుల పునఃసమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసం హెచ్చరించింది.ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని గత అక్టోబర్లోనే కోర్టు ఆదేశించింది. సంస్థలు బకాయిలను పునః సమీక్షించాలని పలు మార్లు కోర్టును కోరాయి. బకాయిల చెల్లింపులను 20 ఏళ్ల పాటు కంతులుగా రూపంలో చెల్లించేలా సంస్థలకు వెసులుబాటు కల్పించే విధానాలనుకు అనుమతించాలని కేంద్రం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏజీఆర్ ఛార్జీల చెల్లింపు వల్ల సంస్థ పనితీరు దెబ్బ తింటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైనా, లక్షల మంది వినియోగ దారులపైనా పడుతుందని పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టు రేపు విచారణ జరపనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos