కుమారస్వామితో కేసీఆర్‌ చర్చలు..

కుమారస్వామితో కేసీఆర్‌ చర్చలు..

తెలంగాణ సీఎం
కేసీఆర్‌ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో శుక్రవారం ఉదయం ఫోన్‌లో మంతనాలు జరిపారు.వేసవి
కాలం కారణంగా జూరాల ప్రాజెక్ట్‌ దిగువ భాగంలో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో
తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఫోన్‌ చేసి జూరాల ప్రాజెక్ట్‌ నుంచి మూడు టీఎంసీల
నీటిని విడుదల చేయాలంటూ కోరారు.కేసీఆర్‌ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి
ఒకట్రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.కాగా ఫెడరల్‌ ఫ్రంట్‌ను
బలోపేతం చేసే క్రమంలోనే కేసీఆర్‌ కర్ణాటక సీఎం కుమారస్వామితో మంతనాలు జరిపి ఉంటారని
ఊహాగానాలు వినిపించగా ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చించలేదని కేవలం నీటి విడుదల విషయంపై
మాత్రమే ఇద్దరు సీఎంలు చర్చించుకున్నారని అధికార వర్గాలు స్పష్టం చేశాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos