చర్చలు విఫలం…సమ్మె యథాతథం

చర్చలు విఫలం…సమ్మె యథాతథం

హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల అయిదో తేది నుంచి ఆర్టీసీ సమ్మె యథాతథంగా జరుగనుంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె బాట పట్టాల్సిందేనని కార్మికులు నిర్మయించారు. సోమేశ్ కుమార్ కమిటీతో జరిగిన చర్చల్లో తమకు ఎలాంటి నిర్దిష్టమైన హామీ రాలేదని, ఈ నెల 5 నుంచి సమ్మె యథావిధిగా ఉంటుందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు తాము కూడా సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నామని, ప్రభుత్వం, కమిటీ కూడా తమ డిమాండ్లను నెరవేర్చేలా కృషి చేయాలని కోరారు. బుధవారం సోమేశ్‌ కుమార్ కమిటీతో చర్చల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు తమ 26 డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకు పోరాడతామని ఆయన తేల్చి చెప్పారు. కార్మికులంతా మొక్కవోని సంకల్పంతో పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos