తిరువనంత పురం: కుట్టుముక్కు మహాదేవ్ ఆలయం వెలుపల ‘కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఈ టాయిలెట్’ అని రాసివున్న ఫలకం సామాజిక మాధ్యమాల్లో సంచనమైంది. దీంతో ఆలయ నిర్వాహకులు ఆ ఫలకాన్ని వెంటనే తొలగించారు. మూడు శౌచాలయాల పై పురు షులు, మహిళలు, బ్రాహ్మణులు అని విడి విడిగా ఫలకాల్ని రాసారు. ఇది రాష్ట్రానికి తలవంపులు తెచ్చేదిగా ఉందని సామాజిక మాధ్య మాల్లో వ్యాఖ్యానించారు. ‘ఈ ఫలకాలు రెండు దశాబ్ధాల కిందట ఏర్పాటు చేసినని. ఇంతవరకూ వీటికి వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేద’ని ఆలయ కమిటీ అధికారి కన్నన్ తెలిపారు.