ముంబై: బిహార్ శాసనసభ ఎన్నికల తర్వాత ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోనవసరం లేదని శివసేన ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఎలాంటి సహకారం లేని ఓ కుర్రాడు.. తన కుటుంబ సభ్యులను జైల్లో పెట్టినా, సీబీఐ, ఐటీ కేసులు చుట్టుముట్టినా బీహార్ లాంటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సవాల్ విసురుతున్నాడు. రేపు తేజస్వి యాదవ్ బీహార్ సీఎం అయినా ఆశ్చర్చపోనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. దాణా కుంభకోణం కేసులో తేజస్వీ తండ్రి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచాణాళికలో బీజేపీ ఇచ్చిన వ్యాక్సీన్ హామీ ఎన్నికల నియమావళికి వ్యతిరేకం కాదని ఈసీ పేర్కొనటాన్ని ఎద్దేవా చేసారు. ‘భారత ఎన్నికల కమిషన్ బీజేపీ బ్రాంచ్ లాంటిది. కాబట్టి వారి నుంచి ఏమీ ఆశించలేం’ అని హేళన చేసారు.