టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవాలి

టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవాలి

ప్రపంచ కప్‌నకు సన్నద్ధమవుతున్న వేళ…భారత క్రికెట్‌ జట్టుకు
కఠిన సవాళ్లు ఎదురు కావాలని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు.
ప్రసుత్తం క్రికెట్‌ కామెంటరీలో తలమునకలై ఉన్న గవాస్కర్‌ న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో
జరిగిన తొలి టీ2౦లో భారత్‌ ఘోర పరాజయం అనంతరం మీడియాతో మాట్లాడారు. కఠిన సవాళ్లు ఎదురైనప్పుడే
పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుందని, తద్వారా మరింతగా రాటుదేలవచ్చని అన్నారు.
తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకోవాలి. ఒక వేళ కోల్పోయినా నేనేమీ
నిరుత్సాహం చెందను అని పేర్కొన్నారు. ప్రపంచ కప్‌ పూర్వ రంగంలో రిషభ్‌ పంత్‌, కృనాల్‌
పాండ్యా, విజయ్‌ శంకర్‌లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos