టీమిండియా జెర్సీ మార్పు

  • In Sports
  • June 20, 2019
  • 200 Views
టీమిండియా జెర్సీ మార్పు

లండన్‌ : భారత క్రికెట జట్టు జెర్సీ ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో మారనుంది. బ్లూజెర్సీని ధరించే టీమిండియా ఆ మ్యాచ్‌లో మాత్రం ఆరెంజ్‌ జెర్సీ ధరిస్తుంది. దీనికి కారణం ఏమంటే…టీమిండియా జెర్సీ నీలం రంగులో ఉంటుంది. ఇంగ్లండ్‌ జట్టు కూడా దాదాపు అదే రంగు జెర్సీని ధరిస్తోంది. దీంతో ప్రేక్షకులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందనే కారణంతో ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్‌ జెర్సీని ధరించనుంది. ఏవైనా రెండు జట్లు తలపడేటప్పుడు, వాటి జెర్సీ ఒకే రంగులో ఉంటే….ఐసీసీ ప్రతి జట్టుకూ ప్రత్యామ్నాయ జెర్సీలకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఆతిథ్య జట్టుకు మినహాయింపు ఉంటుంది. కనుక ఇంగ్లండ్‌ జట్టు అదే రంగు జెర్సీతో మైదానంలోకి దిగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కే భారత జట్టు జెర్సీ మారనుందని ప్రచారం జరిగింది. కానీ ఆఫ్ఘన్‌ జట్టు ప్రత్యామ్నాయ జెర్సీతో దిగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పసుపు రంగు జెర్సీలను ధరించారు. పాక్‌,  బంగ్లా మ్యాచ్‌లో కూడా ఏదో ఒక జట్టు జెర్సీని మార్చుకోవాల్సి ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos