అసంతృప్తితో వెనుతిరిగిన తృప్తి

అసంతృప్తితో వెనుతిరిగిన తృప్తి

ఎర్నాకుళం:అయ్యప్ప దర్శనానికి వచ్చిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ భద్రతా కారణాలతో శబరిమలకు చేరకుండానే ఇంటి ముఖం పట్టారు. ఆమెకు, సహచరులైన ఏడుగురు మహిళలకు శబరిమల దేవాలయం వరకు రక్షణ కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పడం ఇందుకు కారణం. మంగళవారం ఉదయం ఆమె భద్రత కోసం ఎర్నాకుళం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. దీనికి సానుకూల స్పందన లభించక పోవటంతో పుణెకు తిరిగు ముఖం పట్టారు. ఈ లోగానే కమిషనర్ కార్యాలయం వద్ద ‘శబరిమల కర్మ సమితి’ సభ్యులు చేరుకొని తృప్తి, అమె బృందానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్ణయాన్ని తృప్తి నిరసించారు. ‘శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై న్యాయ స్థానం స్టే ఇవ్వలేదు. అందువల్లే గుడికి వెళ్లేందుకు ఉదయం ఇక్కడకు వచ్చాం. అడుగడుగునా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం. వ్యాజ్యం విచారణలో ఉన్నందున భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారు. ఇది సరి కాదు. నేను, మిగిలిన మహిళలు పోలీసు కార్యాలయంలో ఉండటం కూడా సురక్షితం కాదని అధికారులు చెప్పడంతో వాపస్ పోతున్నాం. నేను భవిష్యత్తులోకూడాఇక్కడకు వస్తూనే ఉంటాను. నాకు రాజకీయ పక్షాలతో సంబంధం లేద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos