బొండా బంగీజంప్ పార్టీ జంప్ కోసమేనా?

బొండా బంగీజంప్ పార్టీ జంప్ కోసమేనా?

తెలుగుదేశం పార్టీలోని ఫైర్‌బ్రాండ్‌ నేతల్లో బొండా ఉమ పేరు మొదటిస్థానంలో ఉంటుంది.ప్రత్యర్థులకు హెచ్చరికులకు అంతేధీటుగా బదులిచ్చే బొండా ఉమ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కీలకనేతగా వ్యవహరిస్తున్నారు.అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం మౌనంగా ఉంటున్న బొండా ఉమ పార్టీ మారనున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించడంతో బొండా ఉమతో పాటు మరికొంత మంది తెదేపా నేతలతో సమావేశమై వారి సమస్యల గురించి చర్చించి పరిష్కారానికి హామీ ఇచ్చారు.దీంతో అప్పటికి వెనక్కి తగ్గినట్లు కనిపించిన ఉమ తాజాగా వైసీపీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తుండడం చర్చనీయాంశమైంది.ఉమ సైతం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో చేసిన పోస్ట్‌ ఈ వార్తలకు బలం చేకూర్చేలా కనిపిస్తోంది.కొద్ది రోజుల క్రితం న్యూజీలాండ్‌ పర్యటనకు వెళ్లిన బొండా ఉమ గతంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బంగీ జంప్‌ చేసిన ప్రాంతంలోనే బంగీజంప్‌ చేసి అందుకు సంబంధించి ఫేస్‌బుక్‌ ఖాతాలో ఫోటోలు షేర్‌ చేశారు. ఈ ఫొటోలతో పాటుగా హ‌ల్లో బెజ‌వాడ‌.. నా త‌ర్వాతి రాజ‌కీయ అడుగు గురించి కూలంక‌ష చ‌ర్చ జ‌రుగుతున్న త‌రుణంలో నేను వేయ‌బోతున్న సాహ‌స‌మైన అడుగు ఇలా ఉండ‌బోతోంది..ఇది ఒక శాంపిల్ అని పోస్ట్ పెట్టారు. పరోక్షంగా మాత్రం తాను సాహ‌స‌మైన నిర్ణ‌యం తీసుకుంటున్నాన‌ని చెప్ప‌టం ద్వారా పార్టీ మార్పు విష‌యం ఖ‌రారు చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎక్క‌డా త‌న పార్టీ మార్పు వార్త‌ల‌ను ఖండిం చ‌క పోవ‌టం ద్వారా వైసీపీలో చేర‌టం ఖాయ‌మ‌నే వార్తలు ఊపందుకున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos