తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మరింత ఊపందుకుంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతలు, అభ్యర్థులు,కార్యకర్తలతో పాటు ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతున్న సినిమా తారలు కూడా ప్రచారాలు,ఆరోపణలు,విమర్శలతో రాజకీయ వేడిని పెంచుతున్నారు.ఈ క్రమంలో ఒకప్పటి హీరోయిన్ దివ్యావాణి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తన గురించి జనసేన పార్టీకి చెందిన ఓ హిజ్రా కార్యకర్త చేసిన విమర్శలపై దివ్యావాణి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు చేయడం విమర్శలు ఎదుర్కోవడం సహజమని అయితే విమర్శలు హద్దులు మీరకూడదని దివ్యావాణి తెలిపారు.ప్రస్తుతం మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి కూడా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఎదిగారని గుర్తు చేశారు.చిరంజీవి స్టార్‌గా ఎదకముందు ఒక చిత్రం చిత్రీకరణ సమయంలో భోజనం చేస్తుండగా ప్రొడక్షన్ మేనేజర్ చిరంజీవి కుర్చీ లాగేశారని అయితే అదే సమయంలో అక్కడే ఉన్న మేకప్ మెన్ శివ తన కుర్చీని చిరంజీవికి ఇచ్చారని గుర్తు చేశారు.అప్పటి నుంచే చిరంజీవి మేకప్ మెన్ శివను గుర్తుంచుకొని స్టార్‌గా ఎదిగాక శివను తన వ్యక్తిగత మేకప్ మెన్‌గా నియమించుకున్నారని గుర్తు చేశారు.కొండవీటి దొంగ చిత్రం షూటింగ్ సమయంలో చిరంజీవి తన ప్రతిభ గుర్తించి ప్రశంసించారని తన రేంజ్ ఏంటో చిరంజీవికి తెలుసన్నారు.అటువంటిది కొంతమంది నాపై విమర్శలు చేస్తూ వారి స్థాయిని మరింత దిగజార్చుకుంటున్నారన్నారు.కాగా జనసేన కార్యకర్తగా ఉన్న తమన్నా అనే ట్రాన్స్‌జెండర్ దివ్యావాణిపై తీవ్ర విమర్శలు చేసింది.దివ్యవాణి ఒక పెద్ద జోకరని ఆమె కేవలం జూనియర్ ఆర్టిస్ట్ అంటూ తమన్నా విమర్శలు చేసింది.అందుకు బదులుగానే దివ్యవాణి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది..