సత్యవేడు: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించి, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల వీడియోను బాధితురాలు మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచాడు. 2024లో వైసీపీ అధిష్టానం ఆదిములాన్ని తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించగా అందుకు ఆయన అంగీకరించలేదు. దీంతో ఆదిమూలం వైసీపికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అనంతరం సత్యవేడు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.