
గత ఎన్నికల సమయంలోనే పార్టీ స్థాపించినా కొన్ని కారణాల వల్ల అప్పుడు పోటీ చేయని పవన్‌కళ్యాణ్ ఈసారి శాసనసభ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేస్తుందంటూ ప్రకటించాడు. అందుకోసం సినిమాలకు స్వస్తి పలికి పూర్తిగా రాజకీయాలకే అంకితమైన వపన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు,ప్రచారాలు ముమ్మరం చేసారు.పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాక ఏడాది కాలంగా పవన్‌కళ్యాణ్‌పై రాజకీయ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి.ఈ క్రమంలో తెలుగుచిత్ర పరిశ్రమ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ కూడా పవన్‌కళ్యాణ్‌ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.గత ఎన్నికల్లో జనసేన మద్దతుతోనే తెదేపా అధికారంలోకి వచ్చిందని తెలిపిన తమ్మారెడ్డి తెదేపా నుంచి వీడిన అనంతరం రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తూ ప్రతీ నియోజకవర్గంలో సమస్యలను పవన్‌కళ్యాణ్ ఎత్తి చూపుతుండడం అభినందనీయమన్నారు. ఎన్నికల సమీపిస్తుండడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయడం తదితర అంశాలు జనసేనకు కలసివస్తాయన్నారు.అయితే గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఎదురైన పరిస్థితి జనసేన కాకుండా ఎదురుకాకుండా పవన్‌కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకునే ముందు చిరంజీవి నలుగురితో చర్చించేవారని ఈ క్రమంలో చిరంజీవి మొతకవైఖరి అవలంబించడంతోనే ప్రజారాజ్యం విఫలమైందన్నారు. కానీ చిరంజీవి ఏ పని చేసినా నలుగురితో చర్చించే అలవాటు ఉంది. మెతకగా ఉన్నప్పటికీ ఆ మెతకతనమే ఆయన్ని మెగాస్టార్ ని చేసింది అని తమ్మారెడ్డి అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ లో ఆ గుణం లేదు. మీరు చిన్నప్పటినుంచి మొండిగానే ఉన్నారు. ఇప్పటికి మారలేదు. రాజకీయాల్లో ఈ వైఖరి సరైనదేనా అని తమ్మారెడ్డి పవన్ ని ప్రశ్నించారు. మీరు ప్రత్యేక హోదా సహా అన్ని అంశాల గురించి పోరాడుతున్నారు. పోరాటం చేసే సమయంలో వ్యూహాలు కూడా అనుసరించాలి. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారా.. తెలుకోకపోతే జగన్, చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో చిక్కుకుపోతారని తమ్మారెడ్డి పవన్ ని హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేసేందుకు అంతా వైజాగ్ కు రావాలని పిలుపునిచ్చారు. నేను కూడా వెళ్ళాను అని తమ్మారెడ్డి అన్నారు. కానీ మీరు మాత్రం రాలేదు అని తమ్మారెడ్డి విమర్శించారు. ఇక మీ సభలకు భారీ ఎత్తున జనం వస్తున్నారు. వారంతా మీకు ఓట్లేస్తారో లేదో గమనించారా. గతంలో చిరంజీవి సభలకు ఇంతకంటే ఎక్కువ జనం వచ్చారు. కానీ వాటన్నింటిని ప్రజారాజ్యం పార్టీ ఓట్లుగా మలచుకోలేకపోయింది.ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే మీకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని తమ్మారెడ్డి పవన్ కళ్యాణ్ ని హెచ్చరించారు.