చెన్నై: తమిళనాడు శ్రీలంకకు ఆపన్నహస్తం అందించింది. చెన్నై నుంచి భారీ నౌకలో 9 వేల టన్నుల బియ్యం, 200 టన్నుల పాలపొడి, 24 టన్నుల ఔషధాలను శ్రీలంక కు తరలించారు. వీటి విలువ రూ.45 కోట్లు ఉంటుందని అంచనా. కేంద్రం నుంచి అనుమతి వస్తే శ్రీలంకకు 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల పాలపొడి, పెద్ద సంఖ్యలో ప్రాణాధార ఔషధాలు పంపిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. శ్రీలంక దయనీయ పరిస్థితి పట్ల ప్రజలు కూడా మానవతా దృక్పథంతో స్పందించి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.