భారత్‌కు తాలిబన్ల ధన్యవాదాలు

భారత్‌కు తాలిబన్ల ధన్యవాదాలు

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో భారత్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేసిన తాలిబన్లు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘అఫ్గాన్ ప్రజల కోసం డ్యాములు, రోడ్లు, ఇతర మౌలికవసతులు ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహెయిల్ షాహీన్ తాజాగా వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ సహా ఇతర దేశాలకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్ కేంద్రంగా మారనీయమని కూడా హామీ ఇచ్చారు. అయితే.. అఫ్గానిస్థాన్‌లో భారత్ ఎటువంటి సైనికపరమైన చర్యలు చేపట్టకూడదని సుహెయిల్ తేల్చి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos