కాబూల్ : కాబూల్ విమానాశ్రయం వద్ద వేచి ఉన్న సుమారు 150 మందిని తాలిబన్లు శనివారం అదుపులోకి తీసుకుని అనంతరం విడిచి పెట్టారు. వీరిలో అధికులు భారతీ యులే. అంతకు ముందు వారిని సమీప పోలీస్ స్టేషన్కు తరలించి పలు ప్రశ్నలు అడిగారు. వారి వద్ద ఉన్న దస్త్రాల్ని పరిశీలించిన తరువాత మళ్లీ వారిని విమానా శ్రయా నికి తరలించారు. తొలుత తాలిబన్లు భారతీయుల్ని అపహరించారన్న వార్త సంచలనం కావటంతో భారత్లో కలకలం రేగింది. అయితే.తాలిబన్లు ఈ వార్తలను ఖండించారని న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ విలేకరి ట్వీట్ చేసారు. భారతీయులను మరో సురక్షిత మార్గంలో విమనాశ్రయంలోకి పంపించామని తాలిబన్లు పేర్కొన్నట్టు ఆ విలేకరి తెలి పారు. వీరంతా సురక్షితంగానే ఉన్నారని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి. స్వదేశానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.