ఆగ్రా : తాజ్ మహల్లో బాంబు ఉందనే సమాచారంతో స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ పోలీసులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. గురువారం ఉదయం ఈ సమాచారాన్నిచ్చిన ఆగంతకుడి ఫోన్ కాల్పై విచారణ చేపట్టారు. ఈ ఫోన్ అందినపుడు తాజ్ మహల్ సందర్శనార్థం 1,000 మంది పర్యాటకులు ఉండిరి. వెంటనే వారందర్నీ ఖాళీ చేయించామని తెలిపారు. ‘‘తాజ్మహల్లో బాంబు ఉంది. అది త్వరలోనే పేలుతుంది అని మాకు ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో మేం అప్రమత్తమయ్యాం. వెంటనే తనిఖీలు చేపట్టాం. సైనిక నియామకంలో తనకు అన్యాయం జరిగిందని ఆయన ఫోన్లో తెలిపాడు.’’ అని ఆగ్రా ఎస్పీ శివరాం యాదవ్ తెలిపారు.