ఆగ్రా: నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ హింస సంభవించే అవకాఃముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జిల్లా యం త్రాంగం అప్రమత్తమైంది. బ్రాడ్బ్యాండ్, మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిషేధించారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఇవి అందుబాటులో ఉండవు. సీఏఏ వ్యతివరేక ప్రచారాన్ని నిరోధానికే ఈ చర్యల్ని తీసుకున్నట్లు అధికారులు తెలి పారు. ‘‘శుక్రవారం ప్రార్థనల సందర్భంగా నగరంలో హింస చెలరేగే ప్రమాదం ఉంది. సామాజక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం కారణంగా ఇప్పటికే అలాంటి ఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడా జరిగాయ’ని జిల్లా అధికారులు పేర్కొన్నారు. ‘శుక్ర వారం ప్రార్థనల తర్వాత కొన్ని సంస్థలు నిరసన ప్రదర్శన చేసే అవకాశముంది. దీంతో శాంతి, భద్రతలకు విఘాతం కలుగు తుం ద’ని నిఘా వర్గాలు హెచ్చరించాయి.