ముంబై : దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఇరవై ఒక్క రకాల మందుల ధరలు త్వరలో యాభై శాతం వరకూ పెరగ నున్నా యి. ఇందుకు మందుల ధరల నియంత్రణ సంస్థ- నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అధారిటీ (ఎన్పీపీఏ) అనుమ తించింది. దరిమిలా యాంటీబయోటిక్స్, ఎలర్జీ మందులు, మలేరియా, బిసీజీ వాక్సిన్, విటమిన్ సి వంటి మందులు సామాన్యులకు మరింత దూరం కానున్నాయి. మందుల ధరలను పెంచాలని గత రెండేళ్లుగా మందుల తయారీ పరిశ్రమ చేసిన వినతికి ఇప్పు డు కేంద్రం స్పందించింది. ముడి పదార్ధాల ధరల పెరుగుదలకారణంగా ఔషధాల లభ్యత తగ్గిపోయే ప్రమాదముందని హెచ్చరిం చారు. ఉదాహరణకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముఖ్యమైన ధరలు 200 శాతం పెరిగాయి. తమకు లాభసాటి కాక పోవటం వల్ల ఆ మందుల ఉత్పత్తిని నిలిపివేతకు చాలా సంస్థలు అనుమతి కోరాయి. ప్రాధమిక దశలో ఉన్న వివిధ రోగాల చికిత్సలో వీటి వినియోగం తప్పనిసరి. ప్రజారోగ్య కార్యక్రమానికి చాలా ముఖ్యం.