టీ20 ప్రపంచ కప్పు షెడ్యూల్

  • In Sports
  • August 17, 2021
  • 136 Views
టీ20 ప్రపంచ కప్పు షెడ్యూల్

అబుదాబీ : ఐసిసి పొట్టి ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. ఒమన్‌తో పాటు యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ టోర్నీలను నిర్వహించనున్నారు. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్, నవంబర్ 14న ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. సెమీస్, ఫైనల్ మ్యాచులకు రిజర్వు డే కేటాయించారు. అక్టోబర్ 24న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి రౌండ్‌లో గ్రూప్-బి నుండి తొలి పోరు ఉంటుంది. అక్టోబర్ 17న మధ్యాహ్నం మ్యాచులో ఒమన్, పపువా న్యూగిని తలపడతాయి. సాయంత్రం మ్యాచులో స్కాట్లాండ్, బంగ్లాదేశ్ ఢీ కొంటాయి. ఆ తర్వాతి రోజు గ్రూప్ -ఎలోని ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, శ్రీ లంక అబుదాబిలో పోటీ పడతాయి. సూపర్ 12 మ్యాచులు అక్టోబర్ 23 నుండి మొదలవుతాయి.
సూపర్-12లో అబుదాబి వేదికగా గ్రూప్-1లోని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అక్టోబర్ 23న బరిలోకి దిగుతాయి. అదే రోజు సాయంత్రం దుబాయ్‌లో జరిగే మ్యాచులో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు తలపడతాయి. ఆసీస్, ఇంగ్లాండ్ పోరు అక్టోబర్ 30న జరుగుతుంది. గ్రూప్-2లో అతిపెద్ద మ్యాచ్ అక్టోబర్ 24న భారత్,పాక్‌ల మధ్య రాత్రి 7.30 గంటలకు  ప్రారంభం కానుంది. అబుదాబిలో నవంబర్ 10న తొలి సెమీస్, దుబాయ్ లో 11న రెండో సెమీస్ ఉంటాయి. నవంబర్ 14 ఆదివారం దుబాయ్‌లో ఫైనల్ పోరు ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos