సైరాకు చేదు అనుభవం…

  • In Film
  • February 25, 2019
  • 171 Views
సైరాకు చేదు అనుభవం…

స్వాతంత్య్ర  వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మాతగా మారి తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవితో అత్యంత ప్రతిష్టాకత్మంగా తెరకెక్కిస్తున్న సైరా నరసింహారెడ్డి శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న విషయం తెలిసిందే.తాజాగా పోరాట సన్నివేశం చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్‌ రెడ్డి బీదర్‌లో ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.అక్కడ వారం నుండి పది రోజుల పాటు చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అక్కడి అధికారుల నుండి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. తాజాగా చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా అక్కడకు చేరుకున్నారట. అయితే షూటింగ్ మొదలు అయిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని షూటింగ్ ను అడ్డుకున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ చిన్నపాటి యాక్షన్ సీన్ ను దర్శకుడు ప్లాన్ చేశాడని – నటీనటుల కాస్ట్యూమ్స్ మరియు కత్తులను చూసి ఇలాంటి సినిమాల చిత్రీకరణకు తాము ఇక్కడ ఒప్పుకోము అంటూ స్థానికులు అడ్డు చెప్పినట్లుగా తెలుస్తోంది.అధికారులు మరియు పోలీసులు కూడా సైరా చిత్ర యూనిట్ సభ్యులను ఒప్పించి అక్కడ నుండి తిరిగి వచ్చేలా ఒప్పించారట. దాంతో సైరా యూనిట్ సభ్యులు బీదర్ నుండి ఒట్టి చేతులతో వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. బీదర్ లో అనుకున్న సీన్స్ ను కోకాపేటలో సెట్టింగ్ వేసి షూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం ..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos