లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్వాతిసింగ్ పై ఆగ్రహించారు. స్వాతి సింగ్ ఇటీవల ఒక పోలీసు అధికారిని ఫోన్లో బెదిరించిన ఆడియో రికార్డు సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పదవికి రాజీనామా చేయాలని పలువురు ఆమెను డిమాండ్ చేశారు. దరిమిలా ఆమెకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సంజాయిషీ తాఖీదుల్ని పంపారు. 24 గంటల్లో తన, డీజీపీ కచ్చేరీలకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారులతో హుందాగా వ్యహరించాలని కూడా హెచ్చరించారు.