ఏ ముహూర్తాన
బాహుబలి సినిమా మొదలుపెట్టారో కానీ చిత్రం విడుదలయ్యాక అందులో బాహుబలిగా నటించిన ప్రభాస్‌కు
మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.ముఖ్యంగా అమ్మాయిల్లో ప్రభాస్‌కు విపరీతమైన
క్రేజ్ ఏర్పడింది.కొద్ది రోజుల క్రితం తాను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే కేవలం
ఒక్క ప్రభాస్‌కు మాత్రమే చెప్తానంటూ తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓపెన్
స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు.తాజా మరో హీరోయిన్ కూడా ప్రభాస్‌పై
తన మనసులో మాట బహిరంగానే చెప్పి ఆశ్చర్యానికి గురి చేసారు.బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ డార్లింగ్ ప్రభాస్ పై మనసు పారేసుకోవడం తెలుగు
చిత్ర పరిశ్రమ లో చర్చకు దారితీస్తోంది.ప్రభాస్ ఈజ్ సో హాట్ అంటూ ఓపెన్గా చెప్పేయడం సంచలనంగా మారింది. `వేర్ ది వెడ్డింగ్` సినిమాలో వివాదాస్పద సన్నివేశంలో నటించి సంచలనం సృష్టించిన స్వరభాస్కర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై మనసు పారేసుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేయడం తో యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది..