న్యూఢిల్లీ: ‘క్యారెక్టర్ సర్టిఫెకెట్లు ఇవ్వడంలోబీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీకి ఆయనే సాటి’ అని జనతా దళ్ (యునైటెడ్) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ శనివారం ఎద్దేవా చేసారు. సుశీల్ మోదీ గతంలో మాట్లాడిన ఒక వీడి యోను ట్విట్టర్లో ఎక్కిం చారు.దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది ‘బీహార్ అంటే తానేనని నితీష్ కుమార్ అనుకుంటూ ఉంటారు. బీహార్ అంటే నితీష్ కాదు.బీహార్ ఆయనది కూడా కాదు. వంచన అనేది నితీష్ డీఏన్ఏలోనే ఉంది. బీజేపీతో 17 ఏళ్లు పొత్తుకు ఆయన వెన్నుపోటు పొడిచారు. జితిన్ రామ్ మాంఝీని, బీహార్ ఓటర్లను, జార్జి ఫెర్నాండెజ్ను, లాలూ ప్ర సాద్ను వంచించారు. నితీష్ డీఎన్ఏ అదే. వంచనకు పాల్పడటం బీహార్ ప్రజల డీఎన్ఏ కాదు’ అని ఆ వీడియోలో సుశీ ల్ మోదీ చెప్పారు. ప్రశాంత్ కిషోర్, జేడీయూ సీనియర్ నేత పవన్ కుమార్ వర్మను ‘కృతజ్ఞత లేని వాళ్ల’ని సుశీల్ మోదీ వ్యాఖ్యా నించారు. మార్కెట్ సేవలకు వచ్చే లాభనష్టాలే ఆయనకు ముఖ్యమని, దేశ సంక్షేమం ఆ తర్వాతే నని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ ప్రతికూల వ్యాఖ్యలతో ఎన్డీఏ కూటమికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని భాజపా విమర్శించింది.వీటికి ప్రతి గానే సుశీల్ మోదీ పాత వీడియో విడుదలైంది.