ఎస్సీ, ముస్లింల ఆదరణ కోల్పోతున్న మోదీ

ఎస్సీ, ముస్లింల ఆదరణ కోల్పోతున్న మోదీ

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని గద్దెను ఎక్కాలని  ఇండియా టుడే పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
(పీఎస్‌ఈ) సర్వేలో 52 శాతం మంది ఆశించగా   కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వైపు 33
శాతం మంది మొగ్గు చూపారు. ఎస్సీలు, మైనారిటీల్లో అత్యధిక శాతం మంది రాహుల్‌ను ప్రధానిగా
చూడాలనుకుంటున్నామనటం గమనార్హం. ఎస్సీ ఓటర్లలో 44 శాతం మంది రాహుల్‌ను భావి
ప్రధానిగా ఎంచుకోగా, 41 శాతం మంది మోదీ వైపే మొగ్గు చూపారు. గత జనవరి నుంచి ఎస్సీల్లో
రాహుల్‌కు ఆదరణ పది శాతం పెరగ్గా, ప్రధాని మోదీకి ఎస్సీల్లో ఆదరణ ఆరు శాతం
తగ్గిందని పీఎస్‌ఈ సర్వే వెల్లడించింది. ముస్లింల్లో 61 శాతం మంది రాహుల్‌ ప్రధాని
కావాలని కోరుకోగా 18 శాతం మంది ముస్లింలు మాత్రమే మోదీ వైపు మొగ్గారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos