మారనున్న లవర్స్‌డే చిత్రం క్లైమాక్స్…

  • In Film
  • February 19, 2019
  • 205 Views
మారనున్న లవర్స్‌డే చిత్రం క్లైమాక్స్…

ఒరు అదార్ లవ్.. ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఫస్ట్ మూవీ. ప్రియా ప్రకాశ్.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అవడానికి కారణం కూడా ఇదే సినిమా. ఆ సినిమాలోని ఓ సాంగ్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియా మొత్తం ప్రియా ప్రకాశ్‌కు ఫిదా అయిపోయింది. దీంతో సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. సినిమాను మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. కానీ.. సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ముఖ్యంగా క్లయిమాక్స్ సినీ అభిమానులకు అస్సలు నచ్చలేదట. నెటిజన్లు కూడా ఈ సినిమాపై నెగెటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. అందుకే క్లయిమాక్స్‌ను మళ్లీ షూట్ చేశారట. ఒక్క రోజులోనే క్లయిమాక్స్‌ను షూట్ చేసి వచ్చే బుధవారం నుంచి పాత క్లయిమాక్స్ స్థానంలో కొత్త క్లయిమాక్స్‌ను చేర్చనున్నారట.పాత క్లయిమాక్స్‌లో హీరో చనిపోవడం.. హీరోయిన్ రేప్‌కు గురవడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో దాన్ని మార్చేసి కొత్తది యాడ్ చేస్తున్నారు. దీంతో సినిమా నిడివి 10 నిమిషాలకు తగ్గిపోనున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. అయితే.. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ క్లయిమాక్స్ మారుతుందా లేదా ఒక్క మలయాళంలోనేనా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు నూరిన్ షెరీఫ్, రోషన్ అబ్దుల్ రహూఫీ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో లవర్స్ డే పేరుతో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos