హనుమకొండ : హనుమకొండలోని రామ్‌నగర్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దంటూ … మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 8 నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.