విద్యార్థి ప్రశ్నలకు నీళ్లు నమిలిన కేంద్ర మంత్రి

విద్యార్థి ప్రశ్నలకు నీళ్లు నమిలిన  కేంద్ర మంత్రి

కోల్కతా: ‘పెట్టే బేడ సర్దుకుని నీ దేశానికి వెళ్లమ’న్న కేంద్ర మంత్రి బాబూలాల్ సుప్రియోకు దిమ్మదిరిగి పోయేలా విద్యార్ధి ముస్తాఫిజూర్ రెహ్మాన్ ప్రతిస్పందించారు. ఫేస్ బుక్ లో వారి మధ్య జరుగుతున్న వాదోపవాదాలు చర్చనీయాంశమైంది. నూతన పౌరసత్వ చట్టాన్ని స్నాతకోత్సవంలో చించి వేసిన దేవోస్మిత పై బాబూలాల్ మండి పడ్డారు. ఆమె విద్యార్హతలపై వ్యాఖ్యలు చేశారు. మరుసటి రోజు పశ్చిమ బంగ బీర్బూమ్కి చెందిన ముస్తాఫిజూర్ రెహ్మాన్ అనే విద్యార్ధి ఘాటుగా స్పందిం చారు. ‘బాబుల్ దా మీరు, ఆవు నుంచి బంగారం తీయొచ్చన్న మీ సహచరుడు దిలీప్ ఘోష్ ఏం చదువుకున్నార’ని నిలదీ శాడు. దీంతో సుప్రియో రెచ్చి పోయారు. ‘ముస్తాఫిజూర్ రెహ్మాన్, ముందు నువ్వు పెట్టేబేడ సర్దుకుని నీ దేశానికి వెళ్లిపో. అప్పు డు నీకు పోస్టు కార్డులో సమాధానం పంపిస్తాన’ని బదులిచ్చాడు. ‘భారత్ ఓ లౌకిక దేశం. వివిధ మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ కలిసి ఉంటారు. మీరు ఓ కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాల’ని రెహ్మాన్ డిమాండు చేసారు. ‘అతడు ఏం చేస్తాడో ముందు నాకు చెప్పాల్సింది. బుద్ధిలేని వాళ్లకు నా మాటలు అర్థం కావు. హిం దు వులు, ముస్లింలకు దీంతో ఎలాంటి ఇబ్బందీ లేదు. బుద్ధి లేని వాళ్లకు నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేద’ని సుప్రి యో పేర్కొన్నారు. సుప్రియోకు వ్యతిరేకంగా గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్కు ఫిర్యాదు చేయనున్నట్లు జాతీయ బంగ్లా సమ్మేళన్ నేత లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos