భారత మార్కెట్లోకి సూపర్‌ కార్‌

భారత మార్కెట్లోకి సూపర్‌ కార్‌

దిల్లీ: లంబోర్గిని అవెంటెడార్‌ ఎస్‌వీజే భారత్‌ మార్కెట్లో విడుదలైంది. తొలికారును కర్ణాటకలో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. ఈ కారును  2018లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ రకమైన కార్లను కేవలం 600 మాత్రమే విక్రయించనున్నారు.  ఈ కారు మొత్తం ఎస్‌, ఎస్‌వీ వెర్షన్లలో లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.6 కోట్లు వరకు ఉండోచ్చు. అవెంటెడార్‌ ఎస్‌వీజేలో 6.5లీటర్‌ వీ12 ఇంజిన్‌ను అమర్చారు. ఇది 720 ఎన్‌ఎం టార్క్‌, 770 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ కారు కేవలం 2.8 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. ఇక 0-200 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. ఇది గంటకు 349 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos