
హైదరాబాద్: వైఎస్ వికానందరెడ్డి హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని తన కుమార్తె సునీతారెడ్డి బుధవారం ఇక్కడ ఆరోపించారు. ‘నాన్న హత్యకేసు విచారణలో అనేక అనుమానాలు ఉన్నాయి. నాన్న చనిపోయిన విషయాన్ని ఉదయం 6.40 కి తెలిపాం. నాన్న మరణించిన స్థలంలో ఏం జరిగిందో సర్కిల్ ఇన్స్పెక్టర్కు బాగా తెలుసు. పరమేశ్వరరెడ్డి వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు నాన్న కష్టపడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నేతలందరితో నాన్నకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం ఆదినారాయణరెడ్డి వర్గానికి బాగా తెలుసు. ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా?’ అని సునీతా రెడ్డి ప్రశ్నించారు.