గులాబి పార్టీలోకి సునీతా లక్ష్మారెడ్డి!

గులాబి పార్టీలోకి సునీతా లక్ష్మారెడ్డి!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల వలసలు చూస్తుంటే పార్టీలో పని చేయడానికి నేతలు,కార్యకర్తలు కావలెను అంటూ నేతలు,కార్యకర్తల కోసం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చే పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీకి ఎదురవడానికి ఎన్నోరోజులు పట్టవేమో అనే అనుమానం కలుగుతోంది.ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పలువురు సీనియర్‌ నేతలు,కీలక నేతలు,కార్యకర్తలు తెరాస,బీజేపీల్లోకి చేరగా తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ మహిళ నేత,మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కూడా తెరాసలో చేరడానికి సిద్ధమయ్యారు.మంగళవారం తెరాస అధినేత కేసీఆర్‌,వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లతో సమావేశమైన సునీత తెరాసలో చేరడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.నర్సాపురలో జరుగనున్న తెరాస బహిరంగ సభలో సునీతా లక్ష్మారెడ్డి తెరాసలో చేరనున్నారు.కాగా సునీత లక్ష్మారెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీ మహిళ నేత డీకే అరుణ తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం.బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయతో కలసి బీజేపీలో చేరాలంటూ సునీతాకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా,పార్టీలో చేరితో చేవెళ్ల నియోజకవర్గం నుంచి టికెట్‌ ఇస్తామన్నా కూడా సునీత బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపలేదని సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos