వాషింగ్టన్: వేసవి పరిస్థితులు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయని హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ శాస్త్ర, సాంకేతిక విభాగ డైరెక్టరేట్ అధికారి బిల్ బ్రియాన్ ఇక్కడ విలేఖరులకు తెలిపారు. తమ పరిశోధనల్లో వేసవి కరోనా వైరస్ వ్యాప్తికి అవరోధాన్ని కల్పిస్తాయని తేలినట్లు చెప్పారు.ఇందుకు ప్రస్తుత భారత దేశ పరిస్థితులు సరిపోతా యన్నారు. వైరస్ పై నేరుగా సూర్య కిరణాలు, వేడి గాలులు పడినపుడు అది తన శక్తిని కోల్పోయి చనిపోయే అవకాశం ఉంద న్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఇదో మంచి అవకాశమని చెప్పారు. 95 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడిగాలులు వీస్తే 18 గంటల జీవాన్ని కలిగిన వైరస్ నిమిషాల వ్యవధిలో చనిపోతుందన్నారు.