వేసవి తాపాన్ని తగ్గించే చీరలు…

వేసవి తాపాన్ని తగ్గించే చీరలు…

వేసవి వచ్చేసింది. ఎండ వేడిమి నుంచి రక్షణ పొందే వస్త్రధారణకు సంబంధించి పురుషులకు ఉండే వెసులుబాటు స్త్రీలకు ఉండదు. ముఖ్యంగా సంప్రదాయ చీరలు ధరించే స్త్రీలు వేసవిలో అనేక అవస్థలు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం వేసవి స్పెషల్గా కొత్త చీరలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో ప్రింటెడ్ కాటన్, కలంకారీ చీరలు ముఖ్యమైనవి. కాటన్ చీర ఆకర్షణీయంగానే కాకుండా వేసవిలో చాలా సౌకర్యంగా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఉన్న వాటిని ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కలంకారీ చీరతో పాటు వచ్చే మ్యాచింగ్ రవికను డిజైన్ చేయించి కుట్టిస్తే బాగా ఉంటుంది. లతలు, చిన్న పువ్వులు ఉండే డిజైన్లు కాటన్ చీరలకు వన్నె తెస్తాయి. ఆధునికత ఉట్టి పడాలంటే రేఖా గణిత డిజైన్లు, లైన్లు ఎంచుకుంటే మంచిది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos