కర్ణాటక రాష్ట్రంలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి జరుగనున్న ఎన్నికలు కన్నడ చిత్ర పరిశ్రమలో చీలికలకు కారణమవుతోంది.దివంగత మాజీ మంత్రి అంబరీశ్ భార్య సుమలత,కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ కుమారస్వామిలు మండ్య ఎంపీ ఎన్నికల పోరులో నిల్చోవడంతో కన్నడ చిత్ర పరిశ్రమ జనాలు రెండు వర్గాలుగా చీలిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సుమలతకు ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్,అగ్రహీరోల్లో ఒకరైడ దర్శన్,సీనియర్ నటుడు దొడ్డణ్ణ తదితరులు మద్దతుగా నిలుస్తున్నారు.ఇక మరో నటుడు సుదీప్ తనకు రాజకీయాలపై ఆసక్తి,అవగాహన రెండూ లేవని అందుకే రాజకీయాల గురించి,ప్రచారం గురించి ఆలోచించడం లేదన్నారు.మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి చాలా ఏళ్లు పంపిణీ దారుడిగా వ్యవహరించడం,నిఖిల్ కుమారస్వామి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో కుమారస్వామికి కొంతమంది నటీనటులు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతోపాటు జేడీఎస్-కాంగ్రెస్‌లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న సినీ నటులు కూడా నిఖిల్ కుమారస్వామికి మద్దతు పలుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానికంగా సేకరించిన అభిప్రాయాల ప్రకారం సుమలతకే మండ్య జిల్లా ప్రజలు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..