బాబుకు సుజన హృదయ కాలేయం

అమరావతి:‘మోసాలు చేయడంలో ఆరితేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు హృదయ కాలే యంగా మారిపోయారని వై.కా.పార్లమెంటరీ నేత విజయ సాయి రెడ్డి గురువారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. ‘అమరావతిలో తనకు సెంటు భూమి కూడా లేదంటున్నారు సుజనా చౌదరి. బ్యాంకులకు ఆరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఇలాగే దబా యించా రు. ఆ కంపెనీలతో తనకేం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నార’ని విమర్శించారు. అధికారంలో ఉన్నన్నాళ్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ బయట పడకుండా కాపాడిన ఎల్లో మీడియా ఇప్పటికీ బానిసత్వాన్ని కొనసా గిస్తూనే ఉంది. అసెంబ్లీ దొంగ కోడెల, ఆయన దూడల మీద ఇప్పటికీ ఈగ వాలకుండా చూసుకుంటోంది. సామాజిక మాధ్యమం అనే మూడో కన్ను తెరుచుకుంది. మీరెంతగా నిజాలు దాయాలని ప్రయత్నిం చినా అది రెప్ప వాల్చదు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరా బాదును నిర్మించా నని జబ్బలు చర్చుకునే పెద్ద మనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించ లేక పోయారో చెప్పరు. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమే. అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు’ అని చంద్రబాబుపై ఆగ్రహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos