విశాఖ: ప్రముఖ ఫార్మా సంస్థ – వసుధ ఫార్మా డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి మైదానంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పక్కనే పోలీసులు ఒక పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నాగవరప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.