పార్టీకి విధేయతతో కాదు.. దేశంపై ప్రేమతో ఓటేయండి

పార్టీకి విధేయతతో కాదు.. దేశంపై ప్రేమతో ఓటేయండి

న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికసమీపించిన వేళ.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి ఎంపిలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీ విధేయత ఆధారంగా ఓటు వేయొద్దని, దేశంపై ప్రేమతో ఓటేయాలని సూచించారు. సెప్టెంబర్‌ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పార్లమెంట్‌ సభ్యులను ఉద్దేశిస్తూ జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఆదివారం వీడియో సందేశం విడుదల చేశారు.”ఈ ఎన్నికల్లో పార్టీ విప్‌ ఉండదు. సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారానే ఎన్నిక జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీకి విధేయత కాదు.. దేశం పట్ల ప్రేమ మీ ఎంపికకు మార్గనిర్దేశం చేయాలి. మన దేశ ఆత్మను కాపాడుకునే నైతిక బాధ్యత అందరిపై ఉంది. నాపై విశ్వాసం ఉంచడం ద్వారా పార్లమెంటరీ సంప్రదా యాలను రక్షించినవారవుతారు. ప్రజాస్వామ్యానికి నిజమైన దేవాలయంగా రాజ్యసభ నిలుస్తుందని చాటిచెప్పవచ్చు” అని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు.ఇది కేవలం ఉప రాష్ట్రపతిని ఎన్నుకునే ఓటు కాదని, భారత స్ఫూర్తిని చాటిచెప్పేదని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలపై భారత ప్రజాస్వామ్యం నిర్మితమైందని, అదే దక్పథంలో దశాబ్దాలుగా బలోపేతం అవుతోందన్నారు. అయితే, నేడు ఆ ప్రజాస్వామ్య భావన తగ్గుతోందని, పౌరుల హక్కులు ఒత్తిడికి లోనవుతున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజాస్వామ్య గణతంత్ర ఆత్మను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos