విజయవాడ: ‘పవన్ కల్యాణ్ తోలు తీస్తానని హెచ్చరిస్తున్నాడు. అందుకు ఇక్కెడవరూ సిద్ధంగా లేర’ని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘నిలకడలేని పవన్ కల్యాణ్ ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో తెలియదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నిల బడితే, రెండు చోట్లా ప్రజలు ఓడించారు. వచ్చే ఎన్నికల్లో ఇంకెన్ని చోట్ల నిలబడతారో? అసలాయనను ప్రజలు అంగీకరిస్తారో లేదో? ఒక సారి తాను లెఫ్టిస్టునంటాడు ఆ తర్వాత బీజేపీతో భాగస్వామినంటాడు. మరో సారి టీడీపీతో వెళతానంటాడు. పవన్ కల్యాణ్ ఎలాంటి వాడన్నది ప్రజలకు సంపూర్ణంగా స్పష్టమైంది. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవులు పంచుకున్న అనంతరం జనసేన, టీడీపీ మైత్రి బట్ట బయ లైంద’ని వ్యాఖ్యానించారు.