ఇస్లామాబాద్, న్యూఢిల్లీ: తమ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన భారత జలాంతర్గామిని అడ్డుకున్నట్లు పాక్ నౌకా దళం చేసిన ఆరోపణల్లో నిజం లేదని భారత్ తెల్చి చెప్పింది. ‘భారత జలాంతర్గామిని తరిమికొట్టేందుకు పాకిస్తాన్ నౌకాదళం తన ప్రత్యేక నైపాణ్యాలను ఉపయోగించింది. పాకిస్తాన్ జలాల్లోకి రాకుండా విజయవంతంగా అడ్డుకుం దని పాకిస్తాన్ నౌకాదళ ప్రతినిధి ఒకరు పేర్కొనట్లు పాక్ పత్రిక ‘ది డాన్’ మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రకటించింది. సముద్రంలో తేలుతున్న జలంతర్గామి ఉపరితల భాగాన్ని గగనతలం నుంచి వీడియోలో చిత్రీకరించిన ఛాయా చిత్రాన్ని ప్రచురించారు. ఈ వీడియో అసలైనదా? లేక నకిలీదో పరిశీలిస్తున్నట్టు భారత నౌకాదళ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఈ వీడియో 2016 నాటిదిగా భావిస్తున్నారు. తప్పుడు ప్రచారంలో భాగంగానే పాకిస్తాన్ ఇప్పుడు ఈ వీడియో విడుదల చేసిందని చెప్పారు. రిలీజ్ చేసిందని చెబుతున్నారు.