హైదరాబాదు: చిరకాల సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్స్ బుధవారం నుంచి సమ్మె ఆరంభించారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రం హాజరవుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28 నుంచి అత్యవసర సేవలనూ బహిష్కరిస్తామని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్లు సమ్మెను వెంటనే విరమించక పోతే చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కరోనా వేళ సమ్మె చేయడం సరికాదన్నారు. జూనియర్ వైద్యుల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.