న్యూ ఢిల్లీ : ‘కరోనా వల్ల తలెత్తిన సంక్షోభంతో బాధపడుతోన్న ప్రజలపై మరింత భారం వేసేలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నారు. ధరల పెంపును ఉపసంహరించుకోవాల’ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళ వారం ప్రధాని నరేంద్ర మోదీ్కి రాసిన లేఖలో విన్నవించారు. ‘అసలే బాధల్లో ఉన్న ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టకూడదు. సంక్షోభ సమయంలో ధరల పెంపు తప్పుడు నిర్ణయం. ప్రజలపై అధిక ధరల భారం మోపి లాభం పొందాలని చూడడం సహేతుకం కాద’ని చెప్పారు. గత పది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే.