ముంబై:అంతర్జాతీయ ప్రతికూలత వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వ్యాపారాలు నష్టాలతో ఆరంభమయ్యాయి. తొమ్మిది గంటల పది నిమిషాల ప్రాంతంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 63 పాయింట్లు కోల్పోయి 50,955 పాయింట్ల వద్ద, జాతీయ స్టాక్ ఎక్సేంజీ-నిఫ్టీ స్వల్పంగా 9 పాయింట్ల నష్టంతో 15,292 వద్ద ఉన్నాయి.