ముంబై: కరోనా మరోసారి పతాక స్థాయికి చేరటంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 882 పాయింట్ల మేర నష్టపోయి 47,949.42 వద్ద ముగిసింది. ఓ దశలో 1,470 పాయింట్ల నష్టంతో కుప్పకూలిన సెన్సెక్స్ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ నష్టాలతోనే ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 258 పాయింట్ల నష్టంతో 14,359.45 వద్ద స్థిరపడింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా, సిప్లా, విప్రో, ఇన్ఫోసిస్ లాభాల్ని గడించాయి. అదాని పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్ సర్వ్ న ష్టపోయాయి.