ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కాస్త స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించినా, దేశీయ సూచీలు ప్రారంభంలో మాత్రం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అయితే, కొద్దిసేపటికి స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల 25 నిముషాల సమయానికి సెన్సెక్స్ 138 పాయింట్లు పెరిగి 82,171 స్థాయిలో, నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 24,973 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, టీసీఎస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కనిపిస్తున్నాయి.