ఒడిదొడుకుల మధ్య

ఒడిదొడుకుల మధ్య

ముంబై: స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మార్కెట్లు ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. తర్వాత పుంజుకుని లాభ పడ్డాయి. లాభ, నష్టాల మధ్య షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశీతంగా పరిశీలిస్తున్నారు. వివిధ రంగాల కేటాయింపులను బట్టి ఆచి, తూచి షేర్ల కొనుగోలు చేస్తున్నారు. ట్రెండ్ బట్టి సాయంత్రం వరకు షేర్ల అమ్మకాలు ఉంటాయి. మధ్యాహ్నం 12.55 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 27.70 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5.70 పాయింట్లు లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు లాభపడగా.. లార్సన్ అండ్ టుబ్రో, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos