ముంబయి : స్టాక్ మార్కెటు్ట్లు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ ప్రారంభించగా నిఫ్టీ 11 వేల సూచికపై సంచరించింది. దాదాపు గా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో 36,562 వద్ద.. నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 11,031 వద్ద ట్రేడయ్యాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 70.57గా నమోదైంది.విప్రో, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇండియా బుల్స్ హెచ్ఎస్జీ షేర్లు లాభాల్లో ఉండగా సన్ ఫార్మా, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.