ముంబై: స్టాక్ మార్కెట్లు గురు వారమూ నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్ 348 పాయింట్లు నష్ట పోయి 37,068కి, నిఫ్టీ 92 పాయింట్లు పతనమై 10, 953కు దిగ జారాయి. బిఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా (5.15%), వేదాంత లిమిటెడ్ (2.91%), ఎన్టీపీసీ (2.75%), ఓఎన్జీసీ (2.06%), ఏసి యన్ పెయింట్స్ (0.99%) లబ్ధి పొందాయి. ఎస్బీఐ (-3.47%), యస్ బ్యాంక్ (-3.28%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.85%), యాక్సిస్ బ్యాంక్ (-2.32%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.32%) నష్ట పోయాయి.