ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల్లో ఆరంభ మయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 10 పాయింట్లకుపైగా కోల్పోయి 38,114 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 15 పాయింట్లకుపైగా క్షీణించి 11,176 వద్ద ఉన్నాయి. మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండటం ఇందుకు కారణం. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభాల్లో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.