నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలోని ఏ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినా లోక్సభలో ప్రస్తావిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానన్నారు. నాగార్జున సాగర్లోని విజయ విహార్ హోటల్లో శనివారం జరిగిన పీసీసీ రాష్ట్ర కార్య వర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా, పార్టీ నాయకులు భట్టి విక్రమార్క, జానారెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. పురపాలక సంఘాల ఎన్నికల్లో సత్తా చాటాలని ఈ సందర్బంగా జానారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.